ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

ఏపీ పీజీ ఈసెట్‌-2019 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరు కాగా,  20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 12 ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో వివిధ కాలేజీలలో ఉన్న 21,941 ఎంటెక్‌, 5,495 ఎంఫార్మసీ సీట్లను మెరిట్‌ ప్రకారం కేటాయించనున్నారు.