ఏపీలో వింత కేసు... ధర్నా చేసిన విద్యార్ధులపై అత్యాచారం కేసు నమోదు..
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు ఓ వింత కేసు నమోదు చేశారు. ఆ తరువాత తప్పు తెలుసుకొని నాలిక్కరుచుకున్నారు. తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థి నేతలు యత్నించారు. అయితే, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థులు పోలీసుల కళ్లుగప్పి లోనికి ప్రవేశించారు. అయితే, సీఎం ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉండగానే పోలీసులు ఐదుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, రిమాండ్ రిపోర్ట్ చూసిన జడ్జి షాక్ అయ్యాడు. ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్ధులపై అత్యాచారం కింద కేసు నమోదు చేయడం ఏంటని జడ్జి మండిపడ్డారు. దీంతో షాకైన పోలీసులు, పాత మ్యాటర్ ను ఎడిట్ చేసిన సమయంలో పొరపాటు జరిగిందని పోలీసులు వాటిని సరిచేసి కోర్టులో సబ్మిట్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)