ఐబీ హెచ్చరికలతో ఏపీ పోలీసులు అప్రమత్తం

ఐబీ హెచ్చరికలతో ఏపీ పోలీసులు అప్రమత్తం

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరంలో ఉన్న ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్‌ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్‌లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్‌లో జరిగిన ఘటనలు, కౌంటింగ్‌ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. గాడిమొగ రిలయన్స్ గ్యాస్ టెర్మినల్‌తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించారు. కేసుల నమోదు, చార్జ్‌షీట్‌లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించారు.