నిరాధార ఆరోపణలు : చంద్రబాబుకి నోటీసులు !

నిరాధార ఆరోపణలు : చంద్రబాబుకి నోటీసులు !

నిరాధార ఆరోపణలు చేసే రాజకీయ నాయకుల పై  అమీతుమీ సిద్ధమవుతోంది ఏపీ పోలీసు శాఖ. ఇప్పటికే కచ్చలూరు ఘటన వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఎంపీ హర్షకుమార్ కి నోటీసులు జారీ చేశారు. తాజాగా వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు కూడా నోటీసులు ఇచ్చారు. వివేకా హత్య కేసుకు సంబంధించి వర్ల రామయ్య కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో సిట్ అధికారులు ఆయనకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. వర్ల రామయ్య చేసిన ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు చూపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఈ కేసులో నిందితులెవరో జగన్‌కు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సంబంధం లేని వారిని నిందితులుగా చూపించబోతున్నారని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరడం లేదని ఆరోపించారు. ఇక అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఈమేరకు చట్టపరమైన అంశాల్ని పరిశీలిస్తున్నారు.