సీఎం వైఖరి మారకపోతే ఏపీలో రాష్ట్రపతి పాలనే..!?

సీఎం వైఖరి మారకపోతే ఏపీలో రాష్ట్రపతి పాలనే..!?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. అనంతరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడాఉతూ.. పీపీఏల విషయంలో పున:సమీక్షపై సీఎం వైఎస్ జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే.. ఏపీలో రాష్ట్రపతి  పాలన విధించేందుకు అవకాశం ఉందన్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని గుర్తుచేశారు యనమల. కేంద్ర సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పీపీఏ వ్యవహారంతో దేశ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయన్నారు మాజీ ఆర్థికమంత్రి. కాగా, ఇప్పటికే పీపీఏల సమీక్ష విషయానికి వెళ్లొద్దంటూ.. ఓ సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసిన కేంద్ర మంత్రి... రెండోసారి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే లేఖ రాయడం.. ఆయన లేఖతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న టారీఫ్‌లను జతచేయడం చేసిన సంగతి తెలిసిందే.