ఈసీ-ఏపీ సర్కార్ మధ్య లోకల్ వార్.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, వైసీపీ ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరింది... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎస్ఈసీ... ఎన్నికలకు సహకరించాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేసిన ఈసీ.. కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సహకరించడంలేదని పిటిషన్లో పేర్కొంది.. తన పిటిషన్లో ప్రతివాదులుగా పంచాయతీరాజ్ కార్యదర్శి, సీఎస్ నీలం సాహ్ని చేర్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం..
ఇక, స్థానిక సంస్థలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. ఏపీలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ పేరుతో ఎన్నికలు అడ్డుకోవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)