వాలంటీర్లపై ఆంక్షలు.. వారిపై నిఘా పెట్టాలని నిమ్మగడ్డ ఆదేశాలు

వాలంటీర్లపై ఆంక్షలు.. వారిపై నిఘా పెట్టాలని నిమ్మగడ్డ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.. అయితే. మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ఆంక్షలు విధించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.. వాలంటీర్లతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయించవద్దని సూచించిన నిమ్మగడ్డ.. పార్టీలు, అభ్యర్థుల తరపున కూడా వాళ్లు ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. మొత్తంగా వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.. మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లను దూరం పెట్టాలి.. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని ఆదేశించారు నిమ్మగడ్డ.. ఇక, డేటా దుర్వినియోగం చేయకుండా.. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని.. లబ్ధిదారుల డేటా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు.. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.