నేడే ఎస్‌ఐ రాత పరీక్ష

నేడే ఎస్‌ఐ రాత పరీక్ష

ఏపీ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల (ఎస్ఐ) నియామకానికి సంబంధించిన ప్రాథమిక పరీక్ష ఈ రోజు జరగనుంది. పేపర్‌ - 1 పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటకు ఉంటుంది. పేపర్‌ - 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరుగుతుంది. అభ్యర్థులను గంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ తెలిపారు. అయితే నిముషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని ఆయన తెలిపారు. 

హాల్‌టిక్కెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్సు వంటి ఏదైనా ఓ గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రకు రావాలి. అభ్యర్థులు అందరూ నియమనిబంధలను పాటించాలని విశ్వజిత్‌ కోరారు. బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకుంటారు. మొత్తం 334 పోస్టులకు 1.35 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.