ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై వేటు

ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై వేటు

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించి మ‌రో సారి హీట్ పెంచారు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్.. షెడ్యూల్ ప్ర‌కారం.. ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చినా.. మ‌రో వైపు అది ప‌ట్టించుకోకుండా.. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తూనే ఉన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఈ నేప‌థ్యంలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై వేటు ప‌డింది.. ఈ మేరకు ఆదేేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఈ చ‌ర్య‌కు పూనుకుంది.. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధులనుంచి తొలగిస్తున్నామని ఎస్ఈసీ స్ప‌ష్టం చేసింది.. ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదన్నక్లారిటీ ఇచ్చింది. ఓవైపు ఎన్నిక‌లకు స‌హ‌క‌రించేది లేద‌ని ఉద్యోగ సంఘాలు తెగేసి చెబుతుంటే.. మ‌రోవైపు దానిని స‌హించేది లేద‌నే రీతిలో సొంత గూటి నుంచి వేట ప్రారంభించింది ఎన్నిక‌ల సంఘం.