ఏపీ పంచాయతీ ఎన్నికలు: అందరూ సహకరించాలి...
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాలని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం ఎన్నికలు సజావుగా జరపాలని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా సమయంలోనే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని, అలాంటప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఎందుకు నిర్వహించకూడదని యనమల ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో పాటుగా చాలా పార్టీలు సుప్రీకోర్టు తీర్పుపై స్పందించాయి. తీర్పును స్వాగతించాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)