టెన్త్ ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేయండి..

టెన్త్ ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. పది పరీక్షలకు మొత్తం 6,21,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 99.5 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. 5400 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 98.19 శాతం ఉత్తీర్ణతతో తూర్పగోదావరి జిల్లా టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. 83.19 శాతంతో నెల్లూరు జిల్లా అట్టడుగున నిలిచింది.  

ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ యాప్, ఖైజాలా యాప్‌తోపాటు ఫైబర్ నెట్ టీవీ తెరపై కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆయా పాఠశాలలు తమకు కేటాయించిన లాగిన్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ ఏ.సుబ్బారెడ్డి చెప్పారు. 

ఫలితాల కోసం..

ఆర్టీజీఎస్ వెబ్‌సైట్.. www.rtgs.ap.gov.in 
పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్.. https://bit.ly/2E1cdN7 
ఖైజాలా యాప్.. https://aka.ms/apresult