ఏపీ టెట్ ఫలితాలు విడుదల...

ఏపీ టెట్ ఫలితాలు విడుదల...

ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష(టెట్‌) ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏయూలో టెట్-2018 ఫలితాలను విడుదల చేశారు. టెట్‌ ఫలితాల్లో 57.48 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు 3,97,957 మంది అప్లై చేసుకున్నారు. అయితే 3,70,573 మంది పరిక్షకు హాజరు కాగా 2లక్షల 13 వేలమంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను CSC.ap.gov.in, Aptet.ap.cfss.in వెబ్సైట్ లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా పేర్కొన్న షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 30న ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు.