ఓటు వేసి వెనక్కు రాలేకపోతున్నారు !

ఓటు వేసి వెనక్కు రాలేకపోతున్నారు !

 

ఏపీలో జరుగుతున్న ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న లక్షలాది మంది ఉద్యోగులు సొంత ఊళ్లకు వెళ్లారు.  వెళ్ళేటప్పుడే అష్టకష్టాలు పడి ఎలాగో ఊరు చేరుకొని ఓటు వేసిన వారంతా వెనక్కు రావడం ఎలాగో పాలుపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వెళ్లినవారిలో చాలామంది ఈరోజు ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు.  కానీ రైళ్లు, బసులో అన్నీ ఫుల్ అయిపోయాయి.  ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి.  రైల్వే శాఖ, ఆర్టీసీ వేసిన బస్సులు అస్సలు సరిపోవడంలేదు.  ఫ్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇదే అదునుగా వేలకు వేలు చార్జీలు వసూలు చేస్తున్నాయి.  దీంతో ప్రత్యాన్మాయమార్గాలు వెతుక్కునే పనిలో పడ్డారు ప్రయాణీకులు.