వైసీపీవి చిల్లర రాజకీయాలు : రఘువీరా

వైసీపీవి చిల్లర రాజకీయాలు : రఘువీరా

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేరంటున్నారని ప్రజలే మా బలం  అని స్పష్టం చేసారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని తేల్చి చెప్పారు. జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయని రఘవీరా రెడ్డి చెప్పుకొచ్చారు . జిల్లాలో దుగ్గరాజపట్నం, సోమశిల ఉత్తర కాలువ, బ్యారేజీలను కాంగ్రెస్ పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. 

బస్సు యాత్రను అడ్డుకుని వైసీపీ కార్యకర్తలు నేరం చేశారని రఘువీరా మండిపడ్డారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు వైసీపీ ఎందుకు అడ్డుకోలేదని నిలదీసారు.శనివారం వెంకటగిరిలో బస్సుయాత్రను అడ్డుకున్న వైసీపీకి టీడీపీ సహకరించిందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి గ్రహాల్లా పట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి ఇద్దరు నేతలు అధికారం కోసం పాకులాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. అయితే రాహుల్ ప్రధాని కావాలనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోందన్నారు. వచ్చే నెల 8,9 తేదీల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని రఘువీరా పేర్కొన్నారు.