అన్ని‌వర్గాలు సంతోషంగా ఉండాలి.. అదే జగనన్న తపన..

అన్ని‌వర్గాలు సంతోషంగా ఉండాలి.. అదే జగనన్న తపన..

అన్ని‌వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తపన అన్నారు ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారన్నారు. గత ఏడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేయాలని మొక్కుకున్నానని.. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని ఈ సారి మొక్కుకున్నానని తెలిపిన రోజా.. గతంలో‌ కొండపైకి రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి.. ఈసారి అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. మనసున్నవాడు సీఎం అయితే ఎలా ఉంటుందో గతంలో‌ వైఎస్ పాలనలో చూశామని.. ఇప్పుడు కూడా మనసున్న జగనన్నను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.