నా బాయ్‌ఫ్రెండ్‌కి చూసి బౌలింగ్ చేయి

నా బాయ్‌ఫ్రెండ్‌కి చూసి బౌలింగ్ చేయి

ప్లీజ్.. నా బాయ్‌ఫ్రెండ్‌కి చూసి బౌలింగ్ చేయవా అని మోడల్ ఎరిన్ హోల్లాండ్ అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ను కోరింది. ఆసియా కప్ అనంతరం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ రషీద్ ఖాన్ వన్డేలో రెండవ స్థానంను.. ఆల్ రౌండర్, టీ-20లలో మొదటి స్థానం సంపాదించారు. ఇదే ఆనందాన్ని రషీద్ ఖాన్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

ఈ ట్వీట్ కు ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ కట్టింగ్ ప్రియురాలు ఎరిన్ హోల్లాండ్ రి ట్వీట్ చేసింది. 'మొదటి స్థానం పొందినందుకు చాలా సంతోషం. నా కోసం బెన్ కట్టింగ్‌కి చూసి బౌలింగ్ చేయి. ప్లీజ్.. అతనికి దారుణంగా బౌలింగ్ చేయకు' అని ట్వీటింది. 'చూసి బౌలింగ్ వేస్తాను కానీ నా బౌలింగ్‌లో పరుగులు చెయ్యెద్దు అని నువ్వు కూడా చెప్పు' అని రషీద్ రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. త్వరలో ప్రారంభం కానున్న అఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో రషీద్, బెన్ కట్టింగ్ లు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలోనే కట్టింగ్ ప్రియురాలు ఎరిన్ హోల్లాండ్ సరదాగా ట్వీట్ చేసింది.