రజనీ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

రజనీ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు.. అస్వస్థతకు గురైన రాజనీ.. శుక్రవారం ఉదయే ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే... హైబీ కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు.. ఇక, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు... రజనీకి చేసిన వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్న డాక్టర్లు... ఇవాళ మధ్యాహ్నం మరోసారి రజనీని వైద్యుల బృందం పరిశీలించనున్నట్టు తెలిపారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీశీలించిన తర్వాతే డిశ్చార్జ్ చేయనున్నట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా. మరోవైపు ఇవాళే రజనీకాంత్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది... ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రజనీ.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.