తమ నేత బొమ్మ పెట్టుకుని తమపై ఆరోపణలా...

తమ నేత బొమ్మ పెట్టుకుని తమపై ఆరోపణలా...

తమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మపెట్టుకొని తమపై ఆరోపణలా... అంటూ ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పై వైసీపీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు. ఓట్లను చీల్చడానికే టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం లేదంటూ.. వైసీపీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టేది జగన్ పార్టీ అని, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన జగన్‌కు బీజేపీ నుంచి ఎంత ముట్టిందో చెప్పాలని, అలాగే తెలంగాణాలో వైసీపీ పోటీ చేయకుండా.. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినందుకు జగన్‌కు ఎంత సొమ్ము ముట్టిందో చెప్పాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.