యాపిల్‌ నుంచి 60 కొత్త ఇమోజీలు

యాపిల్‌ నుంచి 60 కొత్త ఇమోజీలు

ఇవాళ ప్రపంచ ఇమోజీ డే.
ఈ సందర్భంగా ఐఓఎస్‌ 12 కోసం 60కి తగ్గకుండా  కొత్త ఇమోజీలను యాపిల్‌ కంపెనీ ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.  యూనికోడ్‌ 11.0లో ఆమోదిత కేరెక్టర్స్‌ ఆధారంగా ఈ కొత్త డిజైన్స్‌ను  రూపొందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. బట్టతల, ఉంగరాల జుట్టు, ఎర్ర జుట్టు, అలాగే తెల్ల జుట్టు ఉన్నవారు వంటి కొత్త ఇమోజీలను యాపిల్‌ తీసుకురానుంది. ఆహారానికి సంబంధించి కూడా కొత్త ఇమోజీలు వచ్చాయి. ఐఓఎస్‌ 12 ఈ ఏడాది ద్వితీయార్థంలో ఫ్రీ అప్‌డేట్‌ కింద కంపెనీ అందించనుంది. అపుడు ఈ ఇమోజీలు కూడా అందుబాటులోకి వస్తాయి.