యాపిల్ ఫోన్లపై భారీ తగ్గింపు..

యాపిల్ ఫోన్లపై భారీ తగ్గింపు..

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ మోడల్‌లోని అన్ని వేరియంట్ల ధరపై రూ. 17,000 తగ్గించింది. ఈ పరిమితకాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానుంది. భారీ తగ్గింపుతో పాటు హెచ్‌డీసీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై అదనంగా మరో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఆపిల్ పేర్కొంది. అయితే, ఇది పరిమితకాల ఆఫర్ మాత్రమేనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ) ధర రూ. 76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఇది రూ. 59,900కే రానుంది. ఇక 128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 నుంచి రూ. 64,900కు తగ్గనుంది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ) ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు దిగిరానుంది. అంతేగాక.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది.