బ్యాటరీ సమస్యలకు రీఛార్జబుల్ ఐఫోన్ కేస్ తో చెక్

బ్యాటరీ సమస్యలకు రీఛార్జబుల్ ఐఫోన్ కేస్ తో చెక్

బ్యాటరీ సమస్యలకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇంక్ ఇక ముగింపు పలికింది. ఈ వారం ఆరంభంలో తన సరికొత్త రీఛార్జబుల్ ఐఫోన్ బ్యాటరీ కేసులను విడుదల చేసింది. ఈ రీఛార్జబుల్ ఐఫోన్ కేసులు ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఆర్ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ లైఫ్ ను అనేక గంటలు అదనంగా పెంచుతాయి.

కాలిఫోర్నియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజ సంస్థ.. ది క్యూపర్టినో గతంతో ఇలాంటి కేసునే ఐఫోన్ 6, ఐఫోన్ 7 మోడల్స్ కోసం తయారు చేసింది. కొత్త కేసులు ఐఫోన్ ఎక్స్ఎస్  టాక్ టైమ్ ను 20 గంటల నుంచి 33 గంటలకు, ఎక్స్ఎస్ మ్యాక్స్ టాక్ టైమ్ ను 25 గంటల నుంచి 37 గంటలకు, ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ కి 25 గంటల నుంచి 39 గంటలకు పెంచుతాయని యాపిల్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. ఈ కేసులను ఇండక్టివ్ ఛార్జర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. 

తెలుపు, నలుపు రంగుల్లో వచ్చే రీఛార్జబుల్ ఐఫోన్ కేసుల ధరను 129 డాలర్లుగా నిర్ణయించారు. ఫోన్ కేసులు ఐఫోన్ యూజర్ల విపరీతమైన ఆదరణ పొందాయి. ఇవి యాపిల్ ఇతర ఉత్పత్తుల శ్రేణి కిందికి వస్తాయి. ఈ ఉత్పత్తి శ్రేణి నాలుగో త్రైమాసికంలో 4.2 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించి పెట్టింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 31% ఎక్కువ.