చైనాకు యాపిల్ షాక్..! 29,800 యాప్స్ బ్యాన్‌

చైనాకు యాపిల్ షాక్..! 29,800 యాప్స్ బ్యాన్‌

చైనాకు చెందిన యాప్స్‌ను బ్యాన్ చేయ‌డం కొన‌సాగుతూనే ఉంది.. ఈ ఏడాదిలో భార‌త్.. చైనా‌కు సంబంధించిన యాప్స్‌పై బ్యాన్ విధించి.. ఆ త‌ర్వాత అవి గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాయం చేసింది.. ఇక‌, టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ ఏకంగా 29,800 చైనా యాప్స్‌పై బ్యాన్ విధించింది.. అంటే.. ఆ యాప్స్‌ను అన్నింటినీ.. తన యాప్‌ స్టోర్‌ నుంచి తొల‌గించింది యాపిల్.. వాటిలో ఎక్కువ గేమింగ్ యాప్‌లే ఉన్నాయి.. 29,800 యాప్స్ తొల‌గిస్తే.. వీటిలో 26 వేలకు పైగా గేమ్స్‌కు సంబంధించినవే కావ‌డం విశేషం.

ఓవైపు అనుమతి లేని గేమింగ్ యాప్స్‌పై చైనా అధికారులు దాడులు జ‌రుపుతున్న నేపథ్యంలో యాపిల్‌ ఈ చర్యకు పూనుకుంది.. దీంతో.. చైనా కంపెనీల‌కు షాక్ త‌గిన‌ట్లు అయ్యింది. అయితే.. ఇది చైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీసుకున్న చ‌ర్య మాత్రం కాదు.. ఉన్న‌ట్టుండి తీసుకున్న నిర్ణ‌యం కూడా కాదు.. ఎందుకంటే.. గేమ్ యాప్స్ రూపొందించేవారిని ప్ర‌భుత్వం జారీ చేసిన లైసెన్సులు స‌మ‌ర్పించాల‌ని గ‌తేడాది యాపిల్ సంస్థ కోరింది. లైసెన్స్‌లు స‌మ‌ర్పించ‌ని యాప్స్‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, గ‌త నెల మొద‌టివారంలో 2500కుపైగా యాప్‌ల‌ను త‌న యాప్ స్టోర్ నుంచి యాపిల్ తొల‌గించిన విష‌యం తెలిసిందే.