ఏపీ ఆర్టీసీ సమ్మె విరమణ

ఏపీ ఆర్టీసీ సమ్మె విరమణ

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీ ఆర్టీసీ) కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. కార్మికుల జేఏసీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసి తరవాత సమ్మె ప్రతిపాదనకు స్వస్తి పలకాలని నిర్ణయించారు.  సీఎం గట్టి భరోసా ఇవ్వడం పట్ల కార్మిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ సీఎంతో కార్మిక నేతలు కలిసినపుడు... మీరంతా ప్రభుత్వ ఉద్యోగులని వైఎస్‌ జగన్‌ సంబోధించారు.  ఆర్టీసీ నష్టాల గురించి కార్మికులు ప్రస్తావించగా... కార్మికులను సముదాయించిన ముఖ్యమంత్రి.. 'ఆర్టీసీ సమస్యలు ఇక ప్రభుత్వ బాధ్యత. ఇక మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు. ఆర్టీసీ విలీన ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేస్తా'నని  సీఎం హామి ఇచ్చారు.  సమస్యలన్నీ తాను చూసుకుంటానని...కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలని  సీఎం కోరారు.  సీఎం నిర్ణయం తమకు సంతృప్తి కల్గించిందని, సీఎం భరోసాతో సమ్మె విరమిస్తున్నామని కార్మిక నేతలు తెలిపంఆరు. విలీనంతోపాటు ఆర్థిక కష్టాలను కూడా తమ ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారని కార్మిక నేతలు అన్నారు. అంతకుముందు జగన్‌తో ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై వీరి మధ్య చర్చ జరిగింది.