ఆర్టీసీ సమ్మె తప్పదా..?

ఆర్టీసీ సమ్మె తప్పదా..?

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌సహా మరో 10 సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఈ నెల 22 లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవలను నిలిపివేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కార్మికులకు 40 శాతం వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2013 వేతనాల సవరణకు సంబందించిన బకాయలు వెంటనే చెల్లించాలని, అద్దెబస్సులు పెంచే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని..ఆర్టీసి బస్సులను పెంచాలి వారు డిమాండ్‌ చేస్తున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో యూనిట్లలో సమ్మె సన్నాహ ధర్నాలు చేస్తామని..  ఈనెల 22న 13 జిల్లాల్లో ఉన్న ఆర్‌ఎం కార్యాలయాల వద్ద జేఏసీ ఆధ్వర్ంయలో మహాధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.