ముగిసిన 'సర్కార్' వివాదం !

ముగిసిన 'సర్కార్' వివాదం !

స్టార్ హీరో విజయ్ తో మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' చిత్ర కథ తనదని, దాన్ని మురుగదాస్ కాపీ కొట్టారని వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత కేసు వేసిన సంగతి తెలిసిందే.  ఈ వివాదంపై మురుగదాస్ స్పందిస్తూ కథ పూర్తిగా తన టీమ్ సొంతమని, ఎక్కడా కాపీ కొట్టలేదని, కావాలంటే కోర్టులో సైతం రుజువు చేసుకుంటామని వ్యాఖ్యానించారు.  దీంతో వివాదం ముదిరి సినిమా విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనబడ్డాయి. 

దీంతో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వరుణ్ రాజేంద్రన్ తో సంప్రదింపులు జరిపి వివాదానికి ఫులుస్టాప్ పెట్టిందని తమిళ సినీ వర్గాల సమాచారం.  దీంతో సినిమా అనుకున్నట్టే 6వ తేదీన ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదలకానుంది.