రాజమౌళి బాటలో మురుగదాస్ కూడా...

రాజమౌళి బాటలో మురుగదాస్ కూడా...

రాజమౌళి సినిమాలు చూసిన వాళ్లకు ఒక విషయం అర్ధం అవుతుంది.  సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్ ఫారెన్ సినిమాల్లోనుంచి కాపీ కొట్టినట్టుగా ఉంటుంది.  ఈ విషయాన్ని రాజమౌళి ఎన్నోసార్లు చెప్పారు.  కాన్సెప్ట్ అదే అయినా ట్రీట్మెంట్ చేసే విధానం కొత్తగా ఉండాలి.  అప్పుడే ప్రేక్షకులకు నచ్చుతుంది.  అలా నచ్చే విధంగా తీయగలుగుతున్నాడు కాబట్టే రాజమౌళికి ఇప్పటి వరకు పరాజయం లేదు.  చేసిన అన్ని సినిమాలు హిట్టే. 

కొంతమంది కాపీ కొట్టినా సినిమాలను హిట్ చేసుకోలేకపోతుంటారు.  సొంతంగా కథలు రాసుకొని మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేసే మురుగదాస్... సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న దర్బార్ సినిమా విషయంలో రాంగ్ స్టెప్ వేశాడు.  రాంగ్ స్టెప్ అంటే అదేదో అనుకునేరు.  అదేం కాదు... హాలీవుడ్ లో అప్పుడెప్పుడో వచ్చిన కిల్లింగ్ గంతర్ అనే సినిమా పోస్టర్ ను కాపీ కొట్టారు.  దర్బార్ పోస్టర్ ఇంచుమించుగా అలాగే ఉన్నది.  దీంతో సూపర్ స్టార్ అభిమానులు షాక్ అయ్యారు.  అదేంటి మురుగదాస్ ఇలా కాపీ కొట్టడం ఏంటి... ఒరిజినల్ టాలెంట్ మనదగ్గరలేదా అనే సందేహాలు వెలువడుతున్నాయి.  ఇప్పుడు అభిమానుల మదిలో మరో ఆలోచన కూడా మొదలైంది.  కేవలం పోస్టర్స్ వరకే పరిమితమా లేదంటే... స్టోరీ కూడా అదేనా అన్నది.  మరి దీనికి మురుగదాస్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.