మురుగదాస్ మరో మెట్టు పైకెక్కాడు !

మురుగదాస్ మరో మెట్టు పైకెక్కాడు !

సూపర్ స్టార్ మహేష్ గతంలో మురుగదాస్ డైరెక్షన్లో 'స్పైడర్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.  భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.  దీంతో మహేష్ అభిమానులు మురుగదాస్ పట్ల ఒకింత వ్యతిరేకతను ప్రదర్శించారు.  అంతగా నమ్మితే డిజాస్టర్ ఇస్తారా అంటూ నొచ్చుకున్నారు.  

కానీ మురుగదాస్ మాత్రం మహేష్ బాబుతో తన సాన్నిహిత్యాన్ని మరువలేదు.  ఈరోజు 'మహర్షి' విడుదల సందర్బంగా 'మహేష్ మంచి మనసుకు, కష్టపడే తత్వానికి మహర్షి మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.  ఈ చర్యతో మురుగదాస్ తన నిష్కల్మషమైన మనసును చాటుకుని ఒక మెట్టు పైకెక్కారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.