ఏ.ఆర్. రహమాన్ బయోగ్రఫీ వచ్చేసింది !

ఏ.ఆర్. రహమాన్ బయోగ్రఫీ వచ్చేసింది !

ఏ.ఆర్.రహమాన్ అంటే వినసొంపైన సంగీతం, ఆయన పాటల వలనే సగం హిట్టైన సినిమాలు, ఎన్నో అవార్డులు, జాతీయ పురస్కరాలు, గౌరవ డాక్టరేట్లు, అకాడమీ అవార్డ్.. ఇదే అందరికీ తెలిసింది.  కానీ ఆయన వృత్తిపరమైన లోతులు, వ్యక్తిగతమైన జీవితం గురించి చాలా మందికి తెలీదు.  

ఆ విషయాల్ని తెలియజెప్పడానికే ఇప్పుడు బయోగ్రఫీ రూపంలో 'నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్' పేరుతో రహమాన్ జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఒక పుస్తకం రూపొందింది.  దీన్ని 18 విడుదలచేయనున్నారు.  ఈ పుస్తకాన్ని కృష్ణ త్రిలోక్ రాశారు.  ప్రముఖ ఆన్ లైన్ హాపింగ్ సైట్స్ అయినా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.  వీటిలో పుస్తకం ఖరీదు 449 రూపాయలు కాగా కిండిల్ ఎడిషన్ 426.55 రూపాయలుగా ఉంది.