హైకోర్టు నోటీసులు అందుకున్న రెహమాన్...

హైకోర్టు నోటీసులు అందుకున్న రెహమాన్...

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హైకోర్టు నోటీసులు అందుకున్నాడు. పన్ను చెల్లించాల్సిన విషయమై ఇన్ కం ట్యాక్స్ అధికారులు రెహమాన్ కు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ విచారణను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దానికి వివరణ ఇవ్వాలంటూ రెహమాన్ కు నోటీసులు పంపింది. ఇన్ కం ట్యాక్స్ అధికారులు 2012 కు సంబంధించిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. అప్పటినుండి రెహమాన్ టాక్స్ చెల్లించలేదు కోర్టులో పేర్కొన్నారు. అయితే ఏం జరిగిందంటే... 2009 లో రెహమాన్ ఆస్కార్ అందుకున్న తర్వాత 2012 లో బ్రిటన్ కు చెందిన ఒక సంస్థతో 3.47 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం అప్పుడు రహ్మాన్ ఖాతాలోకి వచ్చింది. కానీ దానికి సంబంధించిన ట్యాక్స్ ను మాత్రం రెహమాన్ చెల్లించలేదు. దాంతో అప్పటినుండి ఇప్పటివరకు ఆయనకు నోటీసులు పంపిస్తున్నాము అని ఇన్ కం ట్యాక్స్ అధికారులు తెలిపారు. అయిన కూడా ఆయన వద్దనుండి సమాధానం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు అధికారులు. మరి ఇన్ కం ట్యాక్స్ నోటీసులకు సమాధానం ఇవ్వని రెహమాన్ హైకోర్టు నోటీసులకు సమాధానం ఇస్తాడా.. లేదా నేది చూడాలి.