స‌ర్కార్ కోసం రెహ‌మాన్ లైవ్‌షో

స‌ర్కార్ కోసం రెహ‌మాన్ లైవ్‌షో

సంగీత ప్ర‌పంచంలో ఏ.ఆర్‌.రెహ‌మాన్ మానియా గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అత‌డు సంగీతం అందించిన ఆల్బమ్ రిలీజ‌వుతోంది అంటే ఆ క్రేజు అభిమానుల్లో పీక్స్‌లో ఉంటుంది. చాలా కాలం త‌ర్వాత రెహ‌మాన్ సంగీతం అందించిన ఆడియో ఆల్బ‌మ్ మార్కెట్లోకి రానుంది. విజ‌య్ హీరోగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న స‌ర్కార్ చిత్రానికి ఆడియో, రీరికార్డింగ్ ప‌నుల్లో రెహ‌మాన్ బిజీగా ఉన్నాడు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది. ఈ వేడుక‌లో ఏ.ఆర్‌.రెహ‌మాన్ బృందం లైవ్ పెర్ఫామెన్సెస్‌తో అద‌ర‌గొట్టేయ‌బోతోందిట‌. 

`స‌ర్కార్` షూటింగ్ అప్‌డేట్ విష‌యానికొస్తే.. టీమ్ చెన్న‌య్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, త‌దుప‌రి అమెరికా వెళుతోంది.  అక్క‌డ‌ 10రోజుల షెడ్యూల్ ముగించి తిరిగి వెన‌క్కి వ‌స్తారు. అప్ప‌టికి టాకీ పూర్త‌వుతుందిట‌. ఇక‌పోతే 7 నంబ‌ర్ స‌ర్కార్‌ రిలీజ్ తేదీ అంటూ సైరన్ మోగించింది స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ‌. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమానుల్లో ప్ర‌స్తుతం ఒక‌టే ఉత్కంఠ‌. మెర్స‌ల్ త‌ర్వాత 150కోట్ల బిజినెస్ పూర్తి చేసుకుంటున్న క్రేజీ సినిమా ఇద‌ని ట్రేడ్ చెబుతోంది. 200కోట్ల షేర్ వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. తుప్పాక్కి, క‌త్తి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర్వాత అదే కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ సినిమాగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.