"ఆదిపురుష్"‌ కోసం రంగంలోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..

"ఆదిపురుష్"‌ కోసం రంగంలోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..

ఆదిపురుష్ చిత్రం లో ప్రభాస్ రోల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దశాబ్దాల క్రితం నాటి కథ తో ఓం రౌత్ ఈ కథను తెరకెక్కించేందుకు సిద్ధం కాగా, రాముడు గా ప్రభాస్, రావణాసురుడు గా సైఫ్ అలీఖాన్ లు కన్ఫర్మ్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చంశనీయం అయింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్,  సింగర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటువంటి చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు అయితే సినిమా ఇంకో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇంకా సంప్రదింపు జరిపే ఆలోచనలో ఉండగా, ఇంకా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.