సర్వం తాళమయం అంటోన్న రెహ్మాన్

సర్వం తాళమయం అంటోన్న రెహ్మాన్

 

2పాయింట్ 0 సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉన్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఈ సినిమా కోసం రెహ్మాన్ చాలా కష్టపడ్డాడు.  ఆరు నెలల క్రితం నుంచే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం మొదలుపెట్టాడు.  దాని ఫలితం ఎలా ఉన్నదో సినిమాలో  మనకు కనిపించింది.  ఒకవైపు పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు తన కుటుంబం నుంచి హీరోగా వచ్చిన మేనల్లుడు జీవీ ప్రకాష్ ను ప్రోత్సహించేందుకు ప్రకాష్ నటించిన సర్వం తాళమయం అనే సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించాడు.  ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. 2పాయింట్ 0 సినిమా తరువాత ఈ సినిమా పాటలకు మంచి హైప్ వస్తుంది అనడంలో సందేహం లేదు.