12 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో రెహమాన్ !

12 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో రెహమాన్ !

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్ చేత మ్యూజిక్ చేయించుకోవడం అంటే చాలా కష్టం.  ఆయన సెలెక్టివ్ గా కొందరు దర్శకులు, హీరోల సినిమాలకే సంగీతం అందిస్తుంటారు.  ప్రస్తుతం విజయ్, మురుగదాస్ ల 'సర్కార్' సినిమాకు సంగీతం చేస్తున్న ఆయన మరొక తమిల్ స్టార్ నటుడు అజిత్ కోసం కూడ డేట్స్ కేటాయించాడు. 

2006లో వచ్చిన 'వరాలరు' సినిమాకి కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి పనిచేయనున్నారు.  హెచ్.వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ   కపూర్ నిర్మించనున్నాడు.  వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈ సినిమా మొదలుకానుంది.