బాలీవుడ్ లో నాపై కుట్ర జరుగుతుంది : రెహ్మాన్

బాలీవుడ్ లో నాపై కుట్ర జరుగుతుంది : రెహ్మాన్

ఆస్కార్ అవార్డ్ సాధించిన అతి కొద్ది మంది భారతీయులలో ఒకరు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఈయన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినీ పరిశ్రమలోని సినిమాలకు సంగీతం అందించారు. అయితే తాజాగా రెహ్మాన్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బేచారా' కు సంగీతం అందించారు. అది లాక్ డౌన్ కారణంగా హాట్ స్టార్ లో విడుదల అయ్యింది. ఈ సందర్బంగా రెహ్మాన్ మాట్లాడుతూ ఆయన బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం  ఇచ్చారు. బాలీవుడ్ లో ఓ గ్యాంగ్ ఉంది. వారే నాపై కుట్ర చేస్తున్నారు అని తెలిపాడు. దిల్ బేచారా దర్శకుడు ముఖేష్ చాబ్రా తన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా రెహ్మాన్ వద్దకు వేళ్ళకు అని ముఖేష్ కు కొంత మంది చెప్పినట్లు ఆయన నాకు చెప్పారు'' అని రెహ్మాన్ వివరించారు. అయిన కేవలం రెండు రోజుల్లోనే ముఖేష్ కు ట్యూన్స్ ఇచ్చానన్నారు. ముఖేష్ మాటల తర్వాత తనకు చాలా విషయాలు అర్థమయ్యాయి అన్నారు.