అవెంజర్స్ కోసం ఏఆర్ రెహమాన్ !

అవెంజర్స్ కోసం ఏఆర్ రెహమాన్ !

 

సూపర్ హిట్ మూవీ సిరీస్ 'అవెంజర్స్' నుండి వస్తున్న కొత్త చిత్రం 'అవెంజర్స్: ఎండ్ గేమ్'.  ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎన్టగానో ఎదురుచూస్తున్నారు.  ఇండియాలో కూడా సినిమాకు మంచి డిమాండ్ ఉంది.  అందుకే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలచేస్తున్నారు.  ఇక ఈ భాషల కోసం ప్రత్యేకంగా ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ చేత ప్రత్యేకంగా ఒక పాటను రూపొందిస్తున్నారు.  ఏప్రిల్ 1వ తేదీన ఈ పాట విడుదలకానుంది.  ఆంటోనీ, జాయ్ రుసో డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.