రెహ్మాన్ ట్యూన్ కు అదితి, రకుల్ స్టెప్పులు

రెహ్మాన్ ట్యూన్ కు అదితి, రకుల్ స్టెప్పులు

ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  రోజా దగ్గరి నుంచి లేటెస్ట్ 2 పాయింట్ 0 వరకు ఆయన మ్యూజిక్ లో గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది.  ఎవరికీ సాధ్యంగాని విధంగా రెండు ఆస్కార్ అవార్డులను కూడా రెహ్మాన్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రెహ్మాన్ తో సినిమా అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతున్నది.  

ఇదిలా ఉంటె, రెహ్మాన్ సినిమాకే కాకుండా కొన్ని యాడ్స్ కూడా సంగీతం అందిస్తుంటాడు. మ్యాంగో మజా కు సంగీతం అందించారు.  రెహ్మాన్ అందించిన ట్యూన్ కు హీరోయిన్స్ రకుల్ ప్రీత్, అదితి రావు హైదరి, డయానా పెంటీ లు డ్యాన్స్ చేశారు.  ఈ యాడ్ వీడియో ను అదితిరావు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది.