రెహ్మాన్ కోసం విజయ్ దర్శకుడు ఏం చేశాడంటే...

రెహ్మాన్ కోసం విజయ్ దర్శకుడు ఏం చేశాడంటే...

తలపతి విజయ్ 63 వ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా సాంగ్స్ కంపోజింగ్ ఇప్పటికే పూర్తయింది. కాగా, ఇందులోని రెండు సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.  ఆ రెండు సాంగ్స్ ఎడిట్ వెర్షన్ ను దర్శకుడు అట్లీ... మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ కు  చూపించారు.  

రెండు సాంగ్స్ ను చూసి రెహ్మాన్ ఫిదా అయ్యారట. సాంగ్స్ బాగా వచ్చాయని రెహ్మాన్ చెప్పారు.  సౌత్ ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరు చేయని స్క్రిప్ట్ తో విజయ్ సినిమాచేస్తున్నారు. నయనతార హీరోయిన్.  ఏజీఎస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  దీపావళికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.