వరుణ్ తేజ్ తో అరవింద సమేత హీరోయిన్..

వరుణ్ తేజ్ తో అరవింద సమేత హీరోయిన్..

ఎఫ్ 2 సినిమా హిట్ తరువాత వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకిగా రీమేక్ చేస్తున్నారు.  బాబీ సింహ చేసిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు.  ఇది పవర్ఫుల్ పాత్ర.  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళంలో సిద్దార్ధ చేసిన పాత్రను తెలుగులో ఎవరు చేస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  

ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే విషయంపై ఆసక్తిగా మారింది.  తాజా సమాచారం ప్రకారం అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన తెలుగమ్మాయి ఈషా రెబ్బ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.  మరోవైపు కన్నడ బ్యూటీ రష్మిక పేరును కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  మరి ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.