'అరవింద సమేత' ఆడియో డేట్ ఫిక్స్ !

'అరవింద సమేత' ఆడియో డేట్ ఫిక్స్ !

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అరవింద సమేత' సినిమా ఆడియో విడుదల తేదీ నిర్ణయమైంది.  ఈ నెల 20వ తేదీన పాటల్ని రిలీజ్ చేయాలని టీమ్ ఏర్పాట్లు చేస్తోంది.  

ఇకపోతే చిత్రాన్ని అక్టోబర్ 11వ తేదీన విడుదలచేయనున్నారు.  'జై లవ కుశ' తరవాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడం, తొలిసారి ఆయన త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  పూజా హగ్దే కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా కనిపించనున్నాడు.