ఓబా..అవలీలగా కొట్టేశాడు..

ఓబా..అవలీలగా కొట్టేశాడు..

ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో బిగ్గెస్ట్ సినిమాలు ఉన్నాయి.  ఇప్పుడు వచ్చిన అరవింద సమేత వాటన్నింటిని తలదన్ని.. బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ మూవీగా రికార్డ్ సృష్టించింది.  ముఖ్యంగా యూఎస్ లో బుధవారం రోజున రిలీజైన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా మిలియన్ డాలర్లు వసూలు చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడం ఒకెత్తయితే.. ఎన్టీఆర్ నటన మరొక ఎత్తు.  త్రివిక్రమ్ సినిమాను ఆవిష్కరించిన తీరు అమోఘం అంటున్నారు.  వెరసి సినిమా బ్లాక్ బస్టర్ ట్యాగ్ ఇచ్చేశారు.  

సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఇది జీవితానికి సంబంధించిన సినిమా అంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఫిలాసఫీని జోడించి.. పదునైన డైలాగులతో ఆకట్టుకున్నాడు. పాయింట్ ను ఎక్కడా మిస్ కానివ్వకుండా సినిమాను నడిపించి ప్రశంసలు పొందాడు త్రివిక్రమ్.  ప్రతి ఒక్కరి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సినిమాకు యూఎస్ అభిమానులు బ్రహ్మరధం పట్టారు.  మామూలుగానే త్రివిక్రమ్ సినిమాలకు యూఎస్ లో అభిమానులు ఉన్నారు.  ఈ సినిమా ద్వారా తమ అభిమానాన్ని మరింత చాటుకున్నారు.  రిలీజైన రోజే మిలియన్ డాలర్లు వసూలు చేసిన అరవింద సమేత.. లాంగ్ రన్ లో యూఎస్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.  

తెలంగాణలో మొదటిరోజు అరవింద సమేత రూ.8.37 కోట్లు వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డును సాధించింది.  మిగతా ఏరియాల రిపోర్ట్స్ రావాల్సి ఉంది.