అరవిందుడి హంగామా మొదలైంది..

అరవిందుడి హంగామా మొదలైంది..

అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరగబోతున్నది.  నిన్న సాయంత్రం నుంచి అక్కడ సందడి వాతావరణం నెలకొంది.  ఫ్యాన్స్ ఇప్పటికే వేడుక జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ సినిమాలోని నాలుగు పాటలు సూపర్ హిట్ కావడం, టీజర్ పక్కా మాస్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా ఉండటంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.  త్రివిక్రమ్ తన పంథాకు భిన్నంగా సినిమాను స్పీడ్ గా పూర్తి చేశాడు.  ఆడియో వేడుకను నిర్వహించకుండానే ఆడియోను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందినా.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆ నిరాశను పోగొట్టేవిధంగా నిర్వహిస్తున్నారట.  ఈ ఈవెంట్ లోనే థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నది.