అరవింద సమేత రిలీజ్ డేట్ అదే రోజున ప్రకటిస్తారా..?

అరవింద సమేత రిలీజ్ డేట్ అదే రోజున ప్రకటిస్తారా..?

ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆశలు పెరిగాయి.  ఆగష్టు 15 వ తేదీన అరవింద సమేత టీజర్ రిలీజ్ కానున్నది.  ఎన్ని గంటలకు టీజర్ రిలీజ్ చేస్తారు అనే విషయంపై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.  రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ ఇస్తామని మాత్రం యూనిట్ చెప్తున్నది.  

అరవింద సమేత దసరా కానుకగా విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.  ఈ సినిమాపై కొన్ని రూమర్లు వస్తున్నాయి.   రెగ్యులర్ షూటింగ్ లేటుగా జరుగుతుందని.. ఫలితంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.  యూనిట్ మాత్రం ఈ వార్తలను కొట్టేస్తున్నది.  దసరా సందర్భంగా అక్టోబర్ 11 లేదా 12 వ తేదీన సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రిలీజ్ డేట్ ను కూడా టీజర్ రోజునే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు నటిస్తున్నారు.