అరవింద సాక్షిగా ఒక్కటయ్యారు..

అరవింద సాక్షిగా ఒక్కటయ్యారు..

అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ నిన్న రాత్రి వైభవంగా జరిగింది.  ఈ వేడుకను అభిమానుల సమక్షంలో.. బాబాయి బాలకృష్ణ చేతుల మీదుగా జరగడం విశేషం.  బాలకృష్ణ వేడుకలో ఉన్నాడు అంటే.. ఆ వేడుకకు ఒక కళ వస్తుంది అనడంలో సందేహం లేదు.  చాలా కాలం తరువాత బాలకృష్ణ.. అబ్బాయి ఎన్టీఆర్ సినిమా వేడుకకు హాజరయ్యారు.   

ఇలా నాన్నలేని లోటును బాబాయి బాలకృష్ణ తీర్చాడు.  బాలకృష్ణ కుటుంబంలో ఎన్టీఆర్ ను కూడా కలుపుకోవడంతో.. నందమూరి అభిమానుల్లో ఆనందం వెళ్లివిరిసింది.  దీంతో ఆ వేడుక ఓ పెద్ద పండుగలా జరిగింది. ఎన్నో భావోద్వేగాలు.. మరెన్నో ఆనందభరితమైన క్షణాలను ఆ వేడుకలో కనువిందు చేశాయి.  జిగేలుమనిపించిన పూజాహెగ్డే, ఇషా రెబ్బా అందాలు.. గురూజీ త్రివిక్రమ్ మాటలు ప్రవాహం.. కన్నులకు విందును చేసిన పాటలతో అరవింద సమేత సక్సెస్ వేడుక ఘనంగా ముగిసింది.