ముగింపు దశలో 'అరవింద సమేత' !

ముగింపు దశలో 'అరవింద సమేత' !

మొదటిసారి తారక్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా 'అరవింద సమేత'.  మొదలైన రోజు నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.   మిగిలి ఉన్న పాటల్ని త్వరలోనే హైదరాబాద్లో షూట్ చేయనున్నారు.  

అలాగే ఈ నెలాఖరున భారీ ఆడియో వేడుక నిర్వహించి సెప్టెంబర్ 2వ వారంలో చిత్రాన్ని విడుదలచేయనున్నారు.   హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  ఇందులో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తుండగా నాగబాబు, జగపతిబాబులు  పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.