అభిమానుల సమక్షంలో అరవింద సమేత విజయోత్సవ సభ

అభిమానుల సమక్షంలో అరవింద సమేత విజయోత్సవ సభ

అరవింద సమేత వీర రాఘవ దసరా కానుకగా రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో దూసుకుపోతున్నది.  సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే  సూపర్ హిట్ అయింది.  యూఎస్ లో రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతున్నది.  ఈ విజయాన్ని అభిమానులతో పంచుకోవడానికి అరవింద సమేత యూనిట్ సిద్ధమైంది.  

అక్టోబర్ 21 వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో శిల్పకళా వేదికలో విజయోత్సవ సభను అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ వేడుకలో ఎన్టీఆర్ తో సహా యూనిట్ అందరు పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.