ఎంజీఆర్ పాత్రలో దృవ విలన్..!! 

ఎంజీఆర్ పాత్రలో దృవ విలన్..!! 

తమిళనాడులో అమ్మ జీవితం ఆధారంగా తలైవి అనే సినిమా తెరకెక్కుతోంది.  అమ్మ జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో ఉన్న యువతి నుంచి 60 ఏళ్ల మహిళా వరకు వివిధ గెటప్స్ లో ఆమె కలిపించబోతున్నది. జయలలిత ఎలా మాట్లాడేది.. ఆమె హావభావాలు ఎలా ఉంటుంది అనే విషయాలన్నింటిని ఆమె నిశితంగా గమనించింది. 

కాగా, ఇందులో ఎంజీఆర్ పాత్రలో దృవ సినిమాలో విలన్ గా నటించిన అరవింద స్వామి నటిస్తున్నారు.  ఆయన ఎంతవరకు సెట్ కాగలడు అన్నది తెలియాలి.  ఎందుకంటే... అరవింద్ స్వామి సాఫ్ట్ గా ఉంటారు.  మరి ఈ సాఫ్ట్ క్యారెక్టర్ కంగనా లాంటి హీరోయిన్ ను డామినేట్ చేయగలుగుతుందా అన్నది తెలియాలి.