'జనతా గ్యారేజ్'ను క్రాస్ చేసిన 'అరవింద సమేత' !

'జనతా గ్యారేజ్'ను క్రాస్ చేసిన 'అరవింద సమేత' !

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.  ప్రీమియర్స్ ద్వారా దాదాపు 797,366 డాలర్లను రాబట్టిన ఈ సినిమా ఆ తరవాత రోజు 242, 424, శుక్రవారం 276,497, శనివారం 359, 834, ఆదివారం 170,634 డాలర్లను ఖాతాలో వేసుకుని మొత్తంగా 1.8 మిలియన్ డాలర్లను సాధించింది. 

దీంతో గతంలో విడుదలైన ఎన్టీఆర్ యొక్క 'జనతా గ్యారేజ్' లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డ్ బ్రేక్ అయింది.  ప్రస్తుతం 'అరవింద సమేత' ఎన్టీఆర్ కెరీర్లోని బెస్ట్ గ్రాసర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉంది.  త్వరలోనే ఇది 'నాన్నకు ప్రేమతో' వసూళ్ళని సైతం అధిగమించనుంది.  త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.