తారక్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి !

తారక్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి !

తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అరవింద సమేత' సినిమా పాటలు ఈరోజు సాయంత్రం విడుదలకానున్నాయి.  4 గంటల 50 నిముషాలకు యూట్యూబ్ ద్వారా జ్యూక్ బాక్స్ రిలీజ్ కానుంది.  ఇప్పటికే విడుదలైన రెండు పాటలు 'అనగనగా, పెనివిటి' పాటలు బాగా హిట్టవ్వడంతో మిగిలిన రెండు ఎలా ఉంటాయో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.  

త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతంఅందించారు.  హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణంలో రోపొందిన ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.  ఇందులో పూజా హెగ్డే ప్రధాన కథానాయకిగా నటిస్తుండగా ఈషా రెబ్బా కీలక పాత్రలో, నాగబాబు ఎన్టీఆర్ కు తండ్రిగా నటించారు.