ఓవర్సీస్లో ఎన్టీఆర్ దూకుడు !

ఓవర్సీస్లో ఎన్టీఆర్ దూకుడు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' చిత్రం రేపు రిలీజ్ కానుండగా ఈరోజు రాత్రి నుండే ఓవర్సీస్లో ప్రీమియర్ల రూపంలో ప్రదర్శితమవుతోంది.  అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఈ క్రేజ్ మూలంగానే యూఎస్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలని సైతం వెనక్కి నెట్టి 'అరవింద సమేత' తన సత్తా చాటుతోంది. 

ఇప్పటి వరకు 150 లొకేషన్ల నుండి 368,162 డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు మిలియన్ డాలర్ మార్కును ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఇక హిట్ టాక్ వస్తే ఓవరాల్ వసూళ్లు కూడ ఎన్టీఆర్ కిర్రెలోనే ఉత్తమమైన వసూళ్లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయకిగా నటించగా జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషించారు.