ఆలోచింపజేస్తున్న ‘అర్థ శతాబ్దం’ టీజర్
కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం, నవీన్చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్ర అర్థ శతాబ్దం. రవీంద్ర పుల్లె దర్శకత్వం ఈ సినిమాకి వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. టీజర్ లో సీరియస్ బ్యాక్ డ్రాప్ వాయిస్ ఓవర్ తో వచ్చే సంభాషణలు సస్పెన్స్ గా సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘న్యాయం ధర్మం అవుతుంది కానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు. యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మయుద్దాలెక్కడివి.. ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో.. ఎందుకో’ అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఎస్ క్రియేషన్స్-24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సుహాస్, శుభలేక సుధాకర్ సాయికుమార్, రాజారవీంద్ర, కృష్ణ ప్రియ, ఆమని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)